Sri Shyamala Panchashatsvara Varna Malika Stotram | శ్రీ శ్యామలా పంచాశత్స్వరవర్ణమాలికా స్తోత్రం
Back to Stotras తిరిగి వెళ్ళండి

Sri Shyamala Panchashatsvara Varna Malika Stotram శ్రీ శ్యామలా పంచాశత్స్వరవర్ణమాలికా స్తోత్రం

శ్రీ శ్యామలా పంచాశత్స్వరవర్ణమాలికా స్తోత్రం

వందేఽహం వనజేక్షణాం వసుమతీం వాగ్దేవి తాం వైష్ణవీం
శబ్దబ్రహ్మమయీం శశాంకవదనాం శాతోదరీం శాంకరీమ్ |
షడ్బీజాం సశివాం సమంచితపదామాధారచక్రేస్థితాం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || ౧ ||

బాలాం భాస్కరభాసమప్రభయుతాం భీమేశ్వరీం భారతీం
మాణిక్యాంచితహారిణీమభయదాం యోనిస్థితేయం పదామ్ |
హ్రాం హ్రాం హ్రీం కమయీం రజస్తమహరీం లంబీజమోంకారిణీం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || ౨ ||

డం ఢం ణం త థమక్షరీం తవ కళాంతాద్యాకృతీతుర్యగాం
దం ధం నం నవకోటిమూర్తిసహితాం నాదం సబిందూకలామ్ |
పం ఫం మన్త్రఫలప్రదాం ప్రతిపదాం నాభౌ సచక్రేస్థితాం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || ౩ ||

కం ఖం గం ఘ మయీం గజాస్యజననీం గానప్రియామాగమీం
చం ఛం జం ఝం ఝణ క్వణి ఘణు ఘిణూ ఝంకారపాదాం రమామ్ |
ఞం టం ఠం హృదయే స్థితాం కిణికిణీ నాదౌ కరౌ కంకణాం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || ౪ ||

అం ఆం ఇం ఇమయీం ఇహైవ సుఖదామీకార ఉ ఊపమాం
ఋం ౠం లుం సహవర్ణపీఠనిలయే లూంకార ఏం ఐం సదా |
ఓం ఔం అన్నమయే అః స్తవనుతామానందమానందినీం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || ౫ ||

హం క్షం బ్రహ్మమయీం ద్విపత్రకమలాం భ్రూమధ్యపీఠేస్థితాం
ఇడాపింగళమధ్యదేశగమనామిష్టార్థసందాయినీమ్ |
ఆరోహప్రతిరోహయంత్రభరితాం సాక్షాత్సుషుమ్నా కలాం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || ౬ ||

బ్రహ్మేశాది సమస్త మౌనిఋషిభిర్దేవైః సదా ధ్యాయినీం
బ్రహ్మస్థాననివేశినీం తవ కలాం తారం సహస్రాంశకే |
ఖవ్యం ఖవ్యమయీం ఖగేశవినుతాం ఖం రూపిమోంకారిణీం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || ౭ ||

చక్రాణ్యే సతు సప్తమంతరగతే వర్ణాత్మికే తాం శ్రియం
నాదం బిందుకలామయీంశ్చరహితే నిఃశబ్ద నిర్వ్యాపకే |
నిర్వ్యక్తాం చ నిరంజనీం నిరవయాం శ్రీయంత్రమాత్రాం పరాం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || ౮ ||

బాలామాలమనోహరాం ప్రతిదినం వాంఛంతి వాచ్యం పఠేత్
వేదే శాస్త్ర వివాదకాలసమయే స్థిత్వా సభామధ్యమే |
పంచాశత్స్వరవర్ణమాలికమియాం జిహ్వాగ్ర సంస్థా పఠే-
-ద్ధర్మార్థాఖిలకామవిక్షితకృపాః సిధ్యంతి మోక్షం తథా || ౯ ||

ఇతి శ్రీ శ్యామలా పంచాశత్స్వరవర్ణమాలికా స్తోత్రం ||